Ye Samacharam Song Lyrics

Jesus The Everlasting Love

ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? నువ్వు?

కంటికి కనిపించే చెడ్డ సమాచారమా?
విశ్వాస నేత్రాల మంచి సమాచారమా?
దుష్టుడు నసపెట్టే దుష్ట సమాచారమా?
యేసయ్య వినిపించే సత్య సమాచారమా?
ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? అరె నువ్వు?

I… I believe the report of Jesus
We… We believe the report of Jesus

1. వైద్యులు చెప్తారు, Reports యిస్తారు, ఈ వ్యాధి నయం కాదని
బలహీనమైయున్న శరీరం చెబుతుంది, నే యిక కోలుకోలేనని
వద్దు వద్దు వద్దు, దాన్ని నమ్మవద్దు, యేసుని మాట నమ్మరా!
నీ రోగమంతా నే భరించానంటూ, ప్రభువు చెప్పె సోదరా!
యేసయ్య పొందిన దెబ్బల వలన స్వస్థతుందిరా!

2. దుష్టుడు చెప్తాడు, మోసము చేస్తాడు, నీ పని అయిపొయిందని
పరిస్థితులు నిన్ను వెక్కిరిస్తాయి, నువ్ చేతగానివాడవని
లేదు లేదు లేదు, ప్రభువు చెప్తున్నాడు, నీకు నిరీక్షణుందని
ముందు గతి ఉంది, మేలు కలుగుతుంది, నీ ఆశ భంగము కాదని
నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని!

3. పోటీని చూశాక మనస్సు చెప్తుంది నువ్వు దీన్ని గెలవలేవని
గత ఓటమి చెప్తుంది, హేళన చేస్తుంది, మరలా నువు ఓటమి పాలని
కాదు కాదు కాదు, ప్రభువు చెప్తున్నాడు, నేను నీకు తోడని
నిన్ను మించినోళ్ళు, నీకు పోటీ ఉన్నా దీవెన మాత్రం నీదని
యెహోవానైన నాకు అసాధ్యం ఉన్నాదా అని!

4. చుట్టూరు ఉన్నోళ్ళు సలహాలు యిస్తారు, నువ్వు అడ్డదార్లు తొక్కేయ్ అని
గాల్లోన దీపాన్ని పెట్టేసి దేవుడా అంటే నీకు లాభం ఉండదని
గాల్లో దీపం కాదు మా నిరీక్షణుంది సర్వశక్తుడు యేసులో
అడ్డదార్లు వద్దు రాజమార్గముంది సింహాసనముకు క్రీస్తులో
యేసు క్రీస్తునందు ఈ నిరీక్షణ మమ్మును సిగ్గుపరచదు!

5. అప్పుల ఒత్తిళ్ళు కృంగదీస్తాయి యింక ఈ బ్రతుకు ఎందుకని
అవమాన భారంతో పరువు చెబుతుంది నీకు ఆత్మహత్యే శరణని
చచ్చినాక నువ్వు ఏమి సాధిస్తావు, యేసుని విశ్వసించరా
ఒక్క క్షణములోనే నీ సమస్యలన్నీ ప్రభువు తీర్చగలడురా!
నీవు చావక బ్రతికి దేవుని క్రియలను చాటు సోదరా!

6. డబ్బులు అయిపొతే దిగులు పుడుతుంది, అయ్యో! రేపటి సంగతేంటని
పస్తులు ఉంటుంటే ప్రాణము అంటుంది, ఈ రోజు గడిచేదెలాగని
ఏలియాకు నాడు కాకోలము చేత రొట్టె పంపినాడుగా!
అరణ్యములోన మన్నాను కురిపించి, పూరేళ్ళు కుమ్మరించెగా!
యెహోవా బాహుబలమేమైనా తక్కువైనదా!

7. పాపపు వ్యసనాలు విరక్తి తెస్తాయి, నువ్వు క్షమకనర్హుడవని
యేసుకు దూరంగా ఈడ్చుకెళ్తాయి, ప్రభువు నీపై కోపిస్తున్నాడని
ప్రాణమిచ్చినోడు, నిన్ను మరువలేడు, ప్రేమతో పిలుచుచుండెరా!
యేసువైపు తిరుగు, ఆత్మచేత నడువు, గెలుపు నీదే సోదరా!
శరీరమును దాని యిచ్ఛలతో సిలువెయ్యగలవురా!

Title: Ye Samacharam
Album: Jesus the Everlasting Love
Vocals: Bro. Anil Kumar M.
Lyrics & Tunes: Vinod Kumar M.
Music: Pratap Rana K.