I Am Blessed Person song lyrics

మై హు ధన్య జీవి!
నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు
ఆశీర్వదించినాడు నన్నెప్పుడో
|| యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే
అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ – అది ఆశీర్వాదం ||
I am a blessed person

1. నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు!
తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు!
భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను!
ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను!

2. నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు!
నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు!
లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా!
లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా!

3. నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు!
నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు!
శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా!
కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా!

4. యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?!
ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు!
శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు!
శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు!

5. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు!
ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు!
ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను!
ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను!

6. అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు!
నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు!
ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా!
పట్టణములో పొలములోను దీవించినాడుగా!

7. యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు!
తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు!
వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును!
ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!

Title: I am a blessed person
Album: Jesus the Everlasting Love
Vocals: Bro. Anil Kumar M.
Lyrics & Tunes: Vinod Kumar M.
Music: Pratap Rana K.